Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభూ నన్ను కావవా - పాపిని ఇల బ్రోవవా
దోషములను బాపేవని ఆశపడితిని
కన్నీటి లోకములో నన్నంటిని పాపములో
నేనుండలేనయా - నా యేసయ్యా
దరిచేర్చరావయ్యా - నా యేసయ్యా
1. నీవు నేర్పిన ఓరిమిని భారముగ తలచితిని
ఘోరమైన తీరున పరులను నిందించితిని
స్వార్థములోనే చేదును ఎరిగి
శరణు వేడినానయ్యా కరుణజూపవా
2. చిగురాకు జీవితాన్ని చిదిమేసెను నా పాపం
మదిలో మంచిని సైతం మటుమాయం చేసెను
అపవాదము తొలగించి అపరాధిని మన్నించి
ఆలకించు నా మొరను మరియ తనయుడా