Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభు రాత్రి విందులో పాల్గొందము
మనసార ఆ విందు లోకొందము
మనలో ఐక్యము అవ్వాలని ||2||
తన దేహరుధిరాన్ని మనకిచ్చెను ||2||
llప్రభుll
1 వ చరణం..
పాపక్షమాపణ ఒసగే దేవా
పరిశుద్ధులుగా మార్చుమయా
నీవిచ్చు అప్పద్రాక్షరసము
నాలోని తిమిరాన్ని తొలగించును llప్రభుll
2 వ చరణం..
జీవము గల మా యేసయ్య
జీవ జలములు కురిపించవా
నీవే జీవం నీవే మార్గం
నీవే సత్యం యేసయ్యా llప్రభుll
3 వ చరణం..
నీవే మా ఆశ్రయ దుర్గం
నీవే నా ఉన్నత బలము
సత్య వాక్కు పలికిన దేవా
నిత్యము మాలో నిలపుమయ్యా llప్రభుll