Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: ప్రభు సత్ప్రసాద విందునకై
ఆతురతోను పరుగిడి రారా
అప్ప ద్రాక్షారసమున జేసుని గైకొనుమా
గైకొనుమా, గైకొనుమా, గ్రెగొనుమా
1. దివ్య అప్ప మే దైవ శరీరం
దివ్య రసమే దైవరక్తం
జ్ఞాపకార్ధముగా మనకొసగి పరమునకు
ఏగెనుగా, ఏగెనుగా, ఏగెనుగా పరమునకు
2. దివ్య సత్ప్రసాదమే క్రీస్తు
క్రీస్తే దివ్య సత్ప్రసాదం
మది నుంచి నీ హృదయ ఫలకను
సవరించు, సవరించు
సవరించు, సవరించు
3. శిరమున ముండ్ల మకుటము ధరించి
మన పాపములకై స్లీవను భరించి
పాప విమోచన చేయను ప్రభు యేసు
మరణించెన్-మరణించెన్
మరణించెన్ మరణించెన్
4. కల్వరి గిరిపై ఒంటరిగానే
వెళ్ళెను ప్రభువు త్యాగసహితుడై
నీవును ఆ దారినే ప్రభు యేసుని
వెంబడించు వెంబడించు
వెంబడించు వెంబడించు