Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభు స్నేహం స్వర్గ సహవాసం
ప్రభు భోజ్యం - మధుర ఆహారం
స్వీకరింప తరలిరండి
నిత్య జీవం ఒసగు భోజ్యం ||2||
శాంతి సుధలు స్వర్గ సిరులు
పంచు ఆహారం ||2||
1 వ చరణం..
ప్రేమించె ప్రభు హృదయం
స్నేహ సౌజన్యం
సేవించె ప్రియ జనుల నిత్య సౌభ్యాగం ||2||
సత్యం, మార్గం దివ్య సంతోషం
జీవం, స్వర్గం, పంచు అనుబంధం ||2|| llప్రభుll
2 వ చరణం..
జ్వలియించె ప్రభు నిలయం
స్నేహ బాంధవ్యం
ప్రేమించె ప్రభు జనుల ఐక్య సహవాసం
సంఘం, ధర్మం దివ్యకారుణ్యం
అమరం, మధురం ప్రభుని సంజీవం ||2||