Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: స్నేహార్పణం
ప. ప్రభు వాక్యమే జీవనం
విశ్వాసమే జీవితం
కోయిల గానంలా ప్రభు
కీర్తన పాడెదం ||2||
హల్లెలూయ ||3||
1. ఆకసమందున ఎగిరే పక్షులు
అడవిని తిరిగే లేళ్ళ గుంపులు
దేవుడిచ్చిన ఆహారం పొందుచు ||2||
దేవుని మహిమను చాటుచున్నవి ||ప్ర||
2. పక్షులు మించిన వారము కామా
ప్రభు వాక్యము నమ్మగ లేమా ||2||
దేవుడిచ్చిన ఆహారం పొందుచు ||2||
దేవుని మహిమను చాటగలేమా ||ప్ర||