Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ప్రభు విందులో పాల్గొందామా.....
ప్రేమతో పిలిచెను- ప్రియ సంఘమా||2||
ఆత్మభోజ్యము ఆరగించండి ||2||
అప్పరూపులో ఉన్న
ప్రభుని స్వీకరించండి ||ప్ర||
1. ప్రేమ తీరపు చెంత చేర్చెడి
పరలోకపు విందు
పాపరోగపు పరమౌషధ మీ
పంచామృతవిందు
ప్రభు ప్రేమయే -పరమార్థమై
ఆ ప్రేమయే నా ప్రాణమై
భక్తునికి దేవునికి సంధానము విందు
దేవునికి భక్తునికి అనుసంధానము
ఈ విందు ||ప్ర||
2. అగాథజలములో నడక నేర్పిన '
శ్రీయేసుని విందు
ఆశ్రిత జీవుల ఆత్మలు నింపే
అపురూపపు విందు
ఈ అప్పమే ప్రభు దేహమై
ద్రాక్షరసమే ప్రభు రక్తమై ||2||
ఈ భువికి ఆ దివికి బంధమే
ఈ విందు ఈ భువికి
ఆ దివికి అనుబంధమే ఈ విందు ||ప్ర||