Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. హే ప్రభూ యేసు దేవా నీవేకదా నిరీక్షణ
కరుణతో కావరావా నీయందే మా నమ్మిక ||2|| ||హే||
1. దివ్యనాధా దీనరక్షా పాపములన్
పరిహరించు రావారాజా మమ్మేలగ
మా హృదిని అలంకరింప ||హే||
2. ముక్తి మార్గం మాదు దేవా
కలకాలము కాంక్షిచుచూ
మహిమన్ మాకు చూపుము నీవే
మాదు మహిమలో రక్ష ||హే||
3. అమృతమైన ఆహారమా దాహం
తీర్చు జీవజలమా
నిత్యం నిన్నే నమ్మితిని తప్పక
నన్ను ఆదుకోవా ||హే||