Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభుయేసువే జీవాహారం పరిశుద్ధ బలి ఆహారం
వేగమేరండి త్వరపడిరండి
ప్రభుయేసుని విందులోపాల్గొనరండి
ప్రభుయేసువే జీవాహారం
పరిశుద్ధ బలి ఆహారం
పరిపూర్ణబలి ఈ యాగం
1 వ చరణం..
పరలోకం దిగివచ్చిన భోజ్యమిది
పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది
జీవమును దారపోయు జీవజలము కురిపించు
ఆత్మ ఇది ... జీవమిది ||వేగమే||
2 వ చరణం..
కలువరిలో చిందించిన ప్రేమ ఇది
పాపులను క్షమియించిన కరుణ ఇది
అపవాదిని పారద్రోలి అభాగ్యులను
చేరదీయు వాక్కు ఇది ......స్నేహమిది ||వేగమే||