Type Here to Get Search Results !

ప్రభుయేసు విందులో పాల్గొన రండి ( Prabhu yesu vindhulo palgona randi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభుయేసు విందులో పాల్గొన రండి 

పాప విమోచక విందుకు రండి ||2|| 

మనకోసం భువికేగి తనువును బలిచేసి||2|| 

జీవ వరముగ మారిన శాశ్వత విందు ఇది ||2|| 


1. మన్నా భోజనము మరిపించిన విందు ఇది 

జీవాహారమై వెలుగొందిన విందు ఇది

లోకొను వారికి ఆనందమొసగి ||2|| 

పరమన చేర్చే పరలోక విందు ఇది ||2|| ||ప్రభు|| 


2. ప్రేమ స్వభావమును నేర్పించిన విందు ఇది 

త్యాగ ప్రభావంతో ప్రభవించిన విందు ఇది 

విలువైన దేహాన్ని మన కర్పించి ||2|| 

సహనము నేర్పే వసుదైక విందు ఇది ||2|| ||ప్రభు|| 


3. ఆత్మాహారముగా రూపొందిన విందు ఇది

పరమ ప్రసాదమై ఫలియించిన విందు ఇది 

మనలోని పాపాన్ని ప్రేమతో కడిగి ||2|| 

బాధలు తీర్చే పరిశుద్ద విందు ఇది ||2|| ||ప్రభు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section