Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
llపల్లవిll
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ ll2ll
అల్ఫయు నీవే – ఒమేగయు నీవే ll2ll
llప్రభు యేసుll
1వ చరణం..
ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసు నీ స్వరూపము ll2ll
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము ll2ll llప్రభు యేసుll
2 వ చరణం..
లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని ll2ll
చక్కజేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిన్ను జూడనిమ్ము ll2ll llప్రభు యేసుll
3వ చరణం..
ఎరిగి యెరిగి నే చెడిపోతిని
యేసు నీ గాయము రేపితిని ll2ll
మోసపోతి నేను దృష్టి దొలగితి
దాసుడ నన్ను జూడనిమ్ము ll2ll llప్రభు యేసుll
4 వ చరణం..
ఎందరేసుని వైపు చూచెదరో
పొందెదరు వెల్గు ముఖమున ll2ll
సందియంబు లేక సంతోషించుచు
ముందుకు పరుగెత్తెదరు ll2ll llప్రభు యేసుll
5వ చరణం..
విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడా యేసు ప్రభూ ll2ll
వినయముతో నేను నీ వైపు జూచుచు
విసుగక పరుగెత్త నేర్పు ll2ll llప్రభు యేసుll
6వ చరణం..
కంటికి కనబడని వెన్నియో
చెవికి వినబడని వెన్నియో ll2ll
హృదయ గోచరము కాని వెన్నియో
సిద్ధపరచితివ నాకై ll2ll llప్రభు యేసుll
7వ చరణం..
లోక భోగాలపై నా నేత్రాలు
సోకకుండునట్లు కృప జూపుము ll2ll నీ మహిమ దివ్య స్వరూపమును
నిండార నను జూడనిమ్ము ll2ll llప్రభు యేసుll