Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి : ఆహా.......ఆహ.....
పల్లవి:
ప్రభు యేసు ని సుమధుర వాక్యం
హృదయాలను మీటిన రాగం
ప్రేమను పంచిన వాక్యం
శాంతి సమతల నాదం
అల్లెలూయ...అల్లెలూయ...
అల్లెలూయ...అల్లెలూయ...
1 వ చరణం..
ఆలకించు వారికి....మంజులగాన సుధామృతము
విశ్వసించు వారికి...రక్షణ జీవ ప్రసాదితము
ఆకలి దప్పిక తీర్చునది...స్వర్గపు వాకిలి చేర్చునది
ఆలకించు... ఆదరించు...ఆచరించు ఈ వాక్యం
2 వ చరణం..
ప్రార్థన చేయు వారికి-- శుభములు గూర్చు సాధనము
వేదనలొందు వారికి-- ఊరట గూర్చు స్వాంతనము
దోషము పాపము తీయునది -- స్వస్థత జీవం ఇచ్చినది
ఆలకించు.... ఆదరించు.... ఆచరించు ఈ వాక్యం