Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: కరుణకు రూపం
ప. ప్రభు యేసు పలుకులు
ప్రజావళికి వెలుగులు
ప్రకటించు పెదవులే
ప్రభుయేసుకు ప్రియములు
ప్రణుతించు మనస్సులు
మానవాళికి మార్గదర్శము ||2||
అల్లేలూయ-అల్లేలూయ
అల్లేలూయ-అల్లేలూయ ||2||
1. లోకసుఖాలు - శాశ్వతమని తలచి ||2||
చీకటిలో చరియించే సమరియ వనిత ||2||
ఆదరించే ఆనందములో
శ్రీయేసుని పలుకులు ఆవరించిన
అంధకార మంతమాయెను అరుదెంచే
గృహమునకు ధన్యురాలుగా ||2||
హల్లేలూయ - హల్లేలూయ
హల్లేలూయ-హల్లేలూయ ||2||
2. ధనధాన్యములు - ఎల్లకాలమని ఎంచి
ఎల్లరి శాపాలకు పాత్రుడయ్యే జక్కయ్య ||2||
అడుగిడే ఆ గృహములో
శ్రీయేసుని పాదములు
మారెను నాడే మనుగడే మారిపోయే
రక్షణ పొందగలిగే ఆ క్షణమునా ||2||
హల్లేలూయ హల్లేలూయ
హల్లేలూయ-హల్లేలూయ ||2||