Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభు యేసుని విందు ఇది
ప్రభు భోజన విందు ఇది ||2||
తనివి తీర ఆరగించి
ప్రభుని దీవెన పొందండి ||2||
.......స్వీకరించి తరించండి....
సత్రసాదం - క్రీస్తుదేహం......
సత్రసాదం ముక్తిమార్గం ||2|| ||ప్రభుయేసు||
1. ప్రేమ స్వరూపుని దివ్యాహారం
దేవుని దయకు ప్రేమకు నిలయం ||2||
ఉత్తానయేసు నిస్వార్ధిక జీవం
క్రైస్తవ జీవిత ఆరంభం ||2||
కృపగల దేవుని స్వీకరించి
ఆ ప్రభు దీవెన పొందెదము ||2||
సత్రసాదం - క్రీస్తుదేహం......
సత్రసాదం ముక్తిమార్గం ||2|| ||ప్రభుయేసు||
2. జీవాహారం-ప్రభుని భోజ్యం
రక్షణ నొసగే మధురాహారం ||2||
సిలువ యాగమే రక్షణ చిహ్నం
క్రీస్తు భోజ్యమే మన్నాహారం ||2||
విశ్వాసముతో ప్రభుని పొందగా
జీవించాలి క్రీస్తుని హృదిలో ||2||
సత్రసాదం - క్రీస్తుదేహం......
సత్రసాదం ముక్తిమార్గం ||2|| ||ప్రభుయేసు||