Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభు యేసుని విందును ప్రేమతో పొందగను -
పరుగిడి రారండి ప్రభు జనమా
పరమును పొందుటకు పావన హృదయముతో-
పయనమై రారండి ప్రభు జనమా
ఇది జీవమునిచ్చు విందు జీవ దేవుని దివ్య విందు
1. ఈ లోకం జీవింప తానిచ్చు భోజ్యం తన దేహమె
ఈ జీవం ఫలియింప ప్రభువిచ్చు పానం తన రుధిరమె
ఈ విందులో పాల్గొనిన ఆయన
మనయందు మనమాయన యందు
జీవింతుము నిత్యం జీవింతుము
2. మన్నా అనెడి భోజ్యమారగించి -
మరణించినారె మన పితరులు
మన ప్రభువందించే ఈ భోజ్య మారగించిన -
మరణము లేదులే ఎన్నటికి