Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభువా దేవా - ప్రేమ రూపివయ్యా
పాపినైన నను పిలచితివా ||ప్రభువా||
1. నీదు నామము స్మరణ చేసిన
చాలునోయి జీవితమున ||2||
మారుమనసు లేని బ్రతుకు
ఎందుకోయీ జగమున
నీ సన్నిధిని చేరనైతిని ||2||
అందుకే నను కరుణించి బ్రోవు ||ప్రభువా||
2. నాదు పాపములు-క్షమియించుటకై
ఎంత వేదన అనుభవించితివో
శాంతముగను సిలువ బాధను
చింతలేకను ఓర్చితివా
అంతమందు నిన్నుచేర ||2||
అందుకే నను కరుణించి బ్రోవు ||ప్రభువా||
3. మధురమైన నీదు ప్రేమను
మరువగలనా బ్రతుకున ||2||
శిలువ లేని జీవితములు
స్థిరము కాదు ఇహమున
నూతన మనసు నాకొసగుమా ||2||
అందుకే నను కరుణించి బ్రోవు ||ప్రభువా||