Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-8
ప: ప్రభువా నా యింటిని నీవు కట్టని యెడల
ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా
ప్రభువా నన్ను నీవు కాయని యెడల
నే మేల్కొనియు ఉండుట లాభం లేదయ్యా
కాయుము నన్ను కాపాడుము నన్ను
నీ పాదమే నాకు శరణం దేవా -
శరణం దేవా నీ శరణం నాకు
చాలును దేవా నీ కృప నాకు ||2|| ||ప్రభువా||
1. ఆకలిని తీర్చుటకు ఆహారం చాలును
నా ఆత్మ దాహం తీర్చువారు ఎవరు దేవా ||2||
కోపమందు క్రోధమందు కృంగిపోనీయక
శాంతి ప్రేమ మార్గంలో నడుపువారెవరయ్యా
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం ఓ నా యేసయ్యా ||2|| ||ప్రభువా||
2. సంపదలు ఉండికూడ నన్ను నేను ఎరుగలేను
పాన్పుపైన పరుండినను సౌఖ్యమేమి పొందలేను ||2||
వాక్యమును బోధించి జ్ఞానమును ఒనగూర్చి ||2||
నీతి న్యాయ మందు నన్ను నడుపువారెవరయ్యా
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం ఓ నా యేసయ్యా ||2|| ||ప్రభువా||