Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభువా నీ పాదం చేరితిని - హృదిలో ఎంతో ఆనందమే
ఎన్నో రోజులు వెదకిన వెలుగును
నీలో ఈరోజు కనుగొంటిని - లోకాన వెలుగే శరణం శరణం
1. అలసి సొలసి ఉన్నవారా, నా చెంతకు రమ్మని పిలిచితివి
నీ వాక్యం నేను నమ్మితిని, నీలో శాంతి పొందితిని
శాంతి దాత శరణం శరణం
2. నన్ను నీవు వెంబడించిన - చీకటిలో నీవు నివసింపవని
పలికిన నీ వాక్యం నమ్మితిని - నీలో వెలుగును పొందితిని
లోకాన వెలుగే శరణం శరణం