Lyrics: Kuchipudi Prakasarao
Tune: Fr. David Raju N
Music: Naveen M
Album: లాలనుచు పాడరే - 6
ప. ప్రభువే నాకు కోట
నా ఆశ్రయ దుర్గము
నను కాపాడు వాడు ఎన్నడు
కునుకడు నిద్రించడు ||2||
1. నా పూర్ణ హృదయముతో
నిన్ను స్తుతియింతును
నీ అద్భుత కార్యములెల్ల
ప్రకటన చేతును. ||ప్ర||
2. ఆపదలో నేనున్నప్పుడు
నీ హస్తము కాపాడును
గాడాంధకారములో
నీ తోడు లభించును ||ప్ర||
3. నీ ఆలయమందు నేను.
కలకాలం వసింతును
ఆపద సమయములందు
నేనుఎవ్వరికి భయపడను ||ప్ర||
4. నీ బడితయు నీ కోలయు
నన్నెన్నడు కాపాడును
నా కాలము చెల్లిన పిదప
నీ సన్నిధి వసింతును ||ప్ర||