Lyrics: శాంతయ్య
Tune: Fr. Gnanam SDB
Music: Naveen M
Album: ప్రణతులు -9
గమపనిసా గరిసనిసా ప్రభువు
మహాదేవుడు దైవములకు మహారాజు ||2||
సంతోష కీర్తనలు పాడుచూ
వినుతింతుము - సన్నుతింతుము! ||2|| ఆ....ఆ...ఆ...ఆ...
1) సంద్రమతనిదే ధరణి అతనిదే
అతడె వానిని కలుగజేసెను ||2||
శిరము వంచి ఆరాధింతుము
ఏకమనసుతో మోకరిల్లెదము ||3|| || ప్రభువు॥
2) పచ్చికతనిదే మచ్చికతనిదే
అతడె వానిని ప్రసాదించెను ||2||
శ్రమలుమరచి సాగిపోదము
ఏకస్వరముతో కీర్తింతుము ||3|| || ప్రభువు॥