Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ప్రభువా నీ పాద పీఠమందు
హృదయ కానుక నా హృదయకానుక
బిరాన చేకొని నన్నేలుమా
నా దైవమా నా దైవమా ||ప్ర||
1. నీకర్పణీయగా నాకేమి లేదుగా
ఈ జీవితంబునే నీవందుకొనుమయా
సదా నీ పాద పూజలో- తరించి పోదును
దయగొనుమా చేకొనుమా
ప్రేమకానుక ప్రేమ కానుక ||ప్ర||
2. నీకన్న మిన్నగా నాకేమి లేదుగా
నాకున్న సర్వము నీకేగా సొంతము సదా
నా తలపు పిలుపులో
నీవుండి పోవుమా
దయగొనుమా చేకొనుమా
ప్రేమకానుక... ప్రేమ కానుక... ||ప్ర||