Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభువా నీ వొసగినదంతా నీకే అర్పణ
దేవా నా జీవితమంతా నీకే సమర్పణ
ఎన్ని శోధనలు తొలగించావో
ఎన్ని మేలులొనరించావో
ఎన్ని జన్మలకైనా నీ రుణం తీర్చుకోగలనా
అందుకే నా జీవితమంతా నీకే సమర్పణ ||ప్రభువా||
1. తల్లివై తండ్రివై
నా అవసరములన్ని తీర్చావు
గురువువై బోధలు చేసి
జానధనునిగ చేసావు
మంచి కుటుంబము
నా కొసగి మంచి
మనిషిగ మలిచావు ||2||
అందుకే నా జీవితమంతా
నీకే సమర్పణ
||ప్రభువా||
2. చీకటిలో చేయి విడువక
తోడైనీడగ నడిచావు
ముళ్ళ బాటలో నేనున్నానని
పూల బాటగా మార్చావు
నా పాదాలకు దీపానివై
గమ్యమునకు నను చేర్చావు ||2||
అందుకే నా జీవితమంతా
నీకే సమర్పణ
||ప్రభువా||