Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సదా నీ సన్నిధిలో
ప. ప్రభువా నీ సన్నిధిలో ఎవరుండగలరు.
ప్రభువా నీ పర్వతమున ఎవరు నిలువగలరు.
పాపి నిలువగలడా దోషి నిలువగలడా ||2||
ద్రోహినిలువగలడా అపవాది నిలువగలడా||2||
1. నిందా రహితుడు ధర్మబద్ధుడు
న్యాయవంతుడు స్నేహశీలుడు ||2||
జీవించును నీలో జీవించును ||2||
నిలువగలుగును నీముందు
నిలువగలుగును ||ప్ర||
2. పాప రహితుడు పుణ్యవంతుడు
సత్యవంతుడు ప్రేమశీలుడు ||2||
జీవించును నీలో జీవించును ||2||
నిలువగలుగును నీముందు
నిలువగలుగును ||ప్ర||