Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకీ : ప్రభువా....
పల్లవి:
ప్రభువా....నీ పర్వత శిఖరమున ఎవడు నిలువగలడు
ప్రభువా....నీ పవిత్ర మందిరమున
అడుగిడుటకు యోగ్యుడు ఎవడు ll 2 ll
నీ చిత్తం ఎరుగువాడు నీ చిత్తం చేయువాడు
నీ చిత్తం చాటువాడు నీ శిఖరమున నిలువగలడు – ll 2 ll ll ప్రభువా ll
(నీ సన్నిధి నిలువగలడు )
1వ చరణం
దయార్ద్ర హృదయులు దుష్క్రియలు చేయనివాడు ll 2 ll
దురాలోచనలు లేనివాడు ధర్మ మార్గమున నడుచువాడు ll 2 ll
నీ చిత్తం ఎరుగువాడు నీ చిత్తం చేయు వాడు
నీ చిత్తం చాటువాడు నీ శిఖరమున నిలువగలడు- ll 2 ll ll ప్రభువా ll
(నీ సన్నిధి నిలువగలడు )
2వ చరణం
నీతి తప్పనివాడు ఏ నింద లేనివాడు ll 2 ll
నిశ్చల మనస్సుతో నమ్మువాడు
నిను నిత్యం అనుసరించువాడు ll 2 ll
నీ చిత్తం ఎరుగువాడు నీ చిత్తం చేయు వాడు ll ప్రభువా ll
నీ చిత్తం చాటువాడు నీ శిఖరమున నిలువగలడు-
(నీ సన్నిధి నిలువగలడు )