Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నీరాగంలో నేస్వరమై
ప. ప్రధాన యాజకుండు యేసుని విందులో
పరవశించుదాం మమతను పంచుదాం
మన ప్రభు యేసుని
మనసారా స్తుతియించుదాం
మహిమ కిరీటం మనదే పొందుదాం ||ప్ర||
1. పరిశుద్ధమైన విందు పరమ దివ్య విందు
క్రీస్తేసుని ప్రేమ విందు జీవమిచ్చు విందు
ప్రభుని సేవించుదాం జీవమునే పొందుదాం
దైవ రాజ్య ప్రాప్తితో సంపన్నులమౌదాం ||ప్ర||
2. ఆత్మ శరీరములను సజీవ యాగముగ
ప్రభవించే ప్రభువుని ఈ విందులో
ప్రణమిల్లి ప్రార్థించి ప్రభుని చెంత చేరుదాం
సర్వలోకమునకు సాక్షులుగా నిలుద్దాం ||ప్ర||