Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: ప్రకటిస్తాం మేము ప్రకటిస్తాం ||2||
ఏసుమాటనే ప్రకటిస్తాం - ప్రభు క్రీస్తు బాటలో పయనిస్తాం
1. సోదరత్వము పెంచే వాక్యం - ప్రేమ తత్వము పంచే వాక్యం
మానవత్వము నింపే వాక్యం మహానందము కోరే వాక్యం
2. ధర్మ మార్గమున నిలిపే వాక్యం-ధైర్య మిచ్చి కాపాడే వాక్యం
నీతియందు నడిపించే వాక్యం- శాంతికోసము పిలిచే వాక్యం
3. దివ్య తేజము ఒసగే వాక్యం-నవ్య జీవము ఇచ్చే వాక్యం
సత్యమందున పెంచే వాక్యం-నిత్య జీవమున చేర్చే వాక్యం