Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ప్రాణ మొసగు వరవాహిని ||ప్రాణ||
పరలోక ఆనంద ఆరంభమా
1. ఇహపరమేలెడు నరదేవుడా
మహిమను వీడిన విమోచకుడా
నరులతో జీవించు కాంక్షవలన్
కరుణా చిహ్నము గావించితిన్ ||ప్రాణ||
2. పితృల మన్నా జీవమిచ్చెనా
పుత్రుని దేహం నిత్యుల జేయు
ఉల్లమున్ కొల్లగ కొనరావా
తెల్లని రూపున దేవ దేవ ||ప్రాణ||
3. విరిగిన వీణా గీతించునా
రాలిన రెమ్మ జీవించునా
పాపిని జీవం ఫలించుటకై
వేంచేయు నీతో కలియుదును ||ప్రాణ||
4. బాధచే కృంగు నర బృందమా
పాపంచే నశించు పాపులారా
జీవము మార్గము సత్యమగు
దేవుని ప్రేమను చవి చూడుము ||ప్రాణ||