Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ససనిస నీసగరి మామరి గాగస నీదప
ప్రియమార రారండి -
ప్రభుయేసు విందునకు
ప్రభు దేహమే ఆహారము -
ప్రభు రుధిరమే మన పానం
1. మానవాళిని రక్షింప -
మన పాపము మోశారే
సిలువ మోపున ధరియించి
చిందించెను రక్తమును
మది మదిని తన రుధిరముతో
కడిగెను కలువరిలో
2. పరమును వీడి ప్రభుయేసు -
మన మధ్యకు వచ్చారే
మరణము గెలిచిన మనక్రీస్తు
ప్రతి హృదిలో నిలుచుటకై
రొట్టెలో ఒదిగెను రిక్తుడు
అయ్యెను లోకాన రారండి