Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
"ప్రణుతింతు ప్రభు ఈ బలి లో-
కీర్తింతు కడు మోదముతో
కల్వరి నాధా- కరుణామయుడా
ప్రేమాలయమౌ- పరమోన్నత ll ప్రణుతింతు ll
1 వ చరణం..
హీనుడ నేను- బలహీనుడను
బలమైన రాతి పై- నను నిలిపితివి ll2ll
తరమా పాడగ నీ మహిమముల్
ఏమని పొగడెద- పరమాత్మాll ప్రణుతింతు ll
2 వ చరణం..
అర్హుడ నేనా- సేవలు చేయ
అభిషేకించితివి- నీ పూజలు చేయ
అండగనుండగ- అభయంబొసగిన
ఏగెదనేనీ- అర్చనలకుll ప్రణుతింతు ll
3 వ చరణం..
ఆనందముతో- అనురాగముతో
నీ దరి చేరితి- నిను సేవింప
పరమ భాగ్యము- పొందగ నేను
మార్గము చూపుము- మరియ సుతాll ప్రణుతింతు ll "