Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ప్రార్థన చేయగరారండి
బైబిల్ గ్రంథం చదవండి
బైబిల్ తెరచి వాక్యము
చదివి ధన్యులు కారండి
1. బేతానియాపుర మరియమ్మ
ప్రభు పదముల కడ కూర్చుండి
దివ్య బోధనలు ఆలించి
తన్మయ మొందెనుగా
ధన్యత గాంచెనుగా
2, ఎజ్రా బైబిల్ చదవంగ
ఇజ్రాయేలు ప్రజ ఆలించ
పాప జీవితం గమనించి క్షమకై వేడెనుగా
కరుణను పొందెనుగా
3. భక్తితో దేవుని భజియించ
బైబిలు గ్రంథం పఠియించ
జీవన మార్గం చూపించ
ముందుకు సాగుమురా
మున్ముందుకు సాగుమురా