Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రార్థన వినెడి పావనుడా ` ప్రార్థన మాకు నేర్పుమయా ||2||
1 వ చరణం..
శ్రేష్టమైన భావము గూర్చి `
శిష్య బృందముకు నేర్పితివి ||2||
పరముడ నిన్ను ప్రణుతించెదము
పరలోక ప్రార్థన నేర్పుమయా llప్రాll
2 వ చరణం..
పరమ దేవుడవని తెలిపి ` కరములెత్తి జంటగ మోడ్చి ||2||
శిరమును వంచి సరిగను వేడిన`సుంకరి ప్రార్థన నేర్పుమయా llప్రాll
3 వ చరణం..
దినదినంబు చేసిన సేవ ` దైవ చిత్తముకు సరిపోవ ||2||
దీనుడనయ్య దిటముగ కొండను`చేసిన ప్రార్థన నేర్పుమయా llప్రాll