Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రార్థింతునయ్యా ! నీ పాద సన్నిధిలో
ప్రార్థింతునయ్యా ! నీ హృదయ వేదనతో
గెత్సెమనే తోటలో - ఒలీవలో తోపులో
మెల్కిసెదెకు వోలె - సద యాజకుడనై
ప్రధాన యాజకుడా ! నా యేసునాధుడా ||4||
1. దినమునకు ఏడుసార్లు దావీదు వలే
దినమునకు మూడుసార్లు దానియేలు వలే
శోధనలకు గురికాకుండా - పట్టుదలతో
ప్రార్థింపనేర్పించుమయా ||2||
పట్టుదలలో ప్రార్థింప నేర్పించుమయా! ||2|| ||ప్రార్థింతు||
2. ఎస్తేరువలె ప్రజలను రక్షించుటకు
యూదితువలె సైతానును ఓడించుటకు
ఏలియా వలె అగ్నిని దించుటకు
కడదాక ప్రార్థింప నేర్పించుమయా ||2||
కడదాకా ప్రార్థింప నేర్పించుమయా !
||ప్రార్థింతు||