Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రేమను మించిన ప్రేమ నా యేసుకారుణ్యం
అవధులే లేని ఆకాశం నా యేసుకారుణ్యం
దివ్యకారుణ్యమా సదా మీకు స్తుతులు
దివ్యకారుణ్యమా మాకు దయచూపండి
1 వ చరణం..
ఊరు పేరు లేకున్నను చేరదీసే కారుణ్యము
భాగ్యసిరులు లేకున్నను స్వర్గమిచ్చే కారుణ్యము
వ్యాధిబాధలెన్నును ఓదార్చి
గుణపరిచే కారుణ్యము
నా పోరాటములో నా ప్రయాణంలో
తోడుగా నిలిచే కారుణ్యం దివ్యకారుణ్యమా
2 వ చరణం..
ప్రార్ధన చేయువారిని ఆలకించే కారుణ్యము
కన్నీరుకార్చు వారిని ఊరడించే కారుణ్యము
శోధన వేదనలెన్నునను ఆదరించే కారుణ్యం
నా శక్తికి నా బలమునకు కారణమే ఈ కారుణ్యం
దివ్యకారుణ్యమా