Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం - 3
ప. ప్రశాంతముగా ఉండుము మనసా
రక్షకుడేసు నీతో నుండా
యేసే ఆదియు, యేసే అంతం
యేసే నిత్యం, యేసే సర్వం
1. దారి తప్పిన వేళలలో ప్రభువే నీకు కాపరి
చీకటి నిండిన బ్రతుకులలో
ప్రభువే నీకు నేర్పరి ||యే||
2. నిన్ను పిలచిన, ప్రభు క్రీస్తు
నిద్రపోడు, కునికిపోడు
కనుపాపవలె కాయును
కలవరం ఎందుకు చెందెదవు ||యే||