Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రతి ఉదయం నా మొదటి పాట నీదే యేసయ్యా
ప్రతి రాత్రి నా చివరిమాట నీతోనేనయ్యా
నమ్మదగినవాడా నన్ను నడిపించు వాడా
ప్రేమ పంచువాడా నన్ను ప్రేమించువాడా
స్తుతియింతున్ నీ నామమున్ -
ధ్యానింతున్ నీ వాక్యమున్
1 వ చరణం..
ఎవరి యొద్దకు పోయెదనయ్యా -
నిత్య జీవపు మాటలు కలవు
నీ చెంత జీవము నిచ్చుటకు వచ్చితినంటివి -
జీవపు మార్గము నాకు నీవైయుంటివి
2 వ చరణం..
ఎవరి యొద్దకు పోగలనయ్యా -
నిత్య శాశ్వత ప్రేమయు కలదు
నీ చెంత శాశ్వత ప్రేమతో ప్రేమించు చుంటివి -
నిత్య ప్రేమతో నను కాయుచుంటివి