Type Here to Get Search Results !

ప్రేమ జగతికి మూలం ( prema jagathiki mulam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రేమే జగతికి మూలం - ప్రేమ దైవ స్వరూపం

ప్రేమే నిత్య జీవం - ఆ ప్రేమే మోక్ష మార్గం llప్రేమేll 


1 వ చరణం.. 

అమర్యాదగా నడువనది - 

అపకారం చేయనిది 

అన్నిటికి తాళునది అన్నిటికి ఓర్చునది 

స్వప్రయోజనం కోరుకొననిది - 

సత్వరమే కోపపడనిది 

మత్సర పడనిది డంబములేనిది - 

ఉప్పొంగనిది ప్రేమ ఒక్కటే llప్రేమేll 


2 వ చరణం.. 

దేవుడు మనిషిని ప్రేమించి - 

తానే మనిషిగ పుట్టాడు 

పాపుల పాలిట పరమార్థముగా - 

సిలువ మ్రానిపై బలియైనాడు 

మనలో మనము ఒకరికొకరము - 

ప్రేమ కలిగి జీవించాలి 

ప్రేమను మించిన పెన్నిధి లేదని - 

జగమంతా చాటించాలి llప్రేమేll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section