Type Here to Get Search Results !

ప్రేమ జ్యోతి చేకొని చేరినాము ( prema jyothi cheskoni cherinamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ప్రేమజ్యోతి చేకొని చేరినాను సన్నిధి 

నీదు పాదసేవకే అంకితంబు ||2|| 

నామది ప్రభు.. ప్రభూ 


1. మనసు నిండ నీవే స్వామి

మరువలేను నేస్తమా 

ఇన్నినాళ్ల జీవితంబు 

హితుడనీకె అర్పితంబు ||2|| 

పథములోన పూలు పరచి 

పరవశాన నిలచినాను ||2|| 

ఎదను నీకు పరచినాను 

నీదురాక కోసమై 

నీదు రాక కోసమై ||ప్రే|| 


2. గుండె గుడిగ మలచినాను

కొలువుదీరు ప్రియతమ 

నీదు ప్రేమ పరిమళాల 

హృదయ సుమము చేకొని ||2|| 

సమత మమత పల్లవించ 

బ్రతుకు వీణ మీటినాను 

విశ్వరూపి నీదు మ్రోల 

ప్రేమగీతి పాడనా ప్రేమగీతి పాడనా ||ప్రే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section