Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రేమతో నను మలచినావు - నన్ను ఎన్నడు విడువకయ్య
నీదు క్షమకై వేడు చుంటిని - కనికరించి కావుమయ్యా
జన్మనిచ్చిన తండ్రి నీవు - నిన్ను విడచి వుండలేను llప్రేమతోll
1 వ చరణం..
హోరుగాలిలో ఎగిరిపోయే - ఆకులాంటి వాడను
వధకు తెచ్చిన గొరియలాగ - నలిగిపోతిని కుమిలిపోతిని ||2||
సుఖములెన్ని కలిగివున్న - ఏమిలేని వాడను ...
నిన్నె నేను చేరుకున్నా - నీవే నాకు శరణము ...llప్రేమll
2 వ చరణం..
జాలిలేని లోకమాయే - ప్రేమనాకు దూరమాయే ...
బ్రతుకు భారం మోయలేని - దారిలేని అనాధనాయే ||2||
తండ్రి నిన్నే వేడుతున్నా - నీవే నాకిక మార్గము
నిన్నే నేను నమ్ముకున్నా - వమ్ము చేయకు నాయనా