Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 4
ప్రేమ ఫలం.... ప్రభు జీవ ఫలం
రక్షణ ధామం.. దివ్య ప్రసాదం
ఇది నా శరీరం... దీనిని భుజించుడి
ఇది నా రక్తం... దీనిని పానము చేయుడి
1 వ చరణం..
మీరే నా స్నేహితులు... దాసులు మీరిక కారు
స్నేహం కోసం నిలిచిన... మీరే ప్రేమకు సాక్షులు
ఆత్మను స్వీకరింపుడు... సత్యమునే గ్రహింపు డు
నేనే మార్గం... నేనే సత్యం... నేనే జీవం
2వ చరణం..
నా ప్రియ శిష్యులు మీరే... నాతో నిలిచిన వారు
సేవలు మీరు చేసిన... మీరే ప్రేమకు సాక్షులు
ఆత్మను స్వీకరింపుడు... లోకమునే జయం పుడు
నేనే మార్గం... నేనే సత్యం... నేనే జీవం
3వ చరణం..
నా గాయాలను తాకుడు.. జీవన శాంతి పొందుడు
నా చేతులనే చూడుడు... పావన జీవం పొందుడు
విశ్వాసంతో నమ్మిన... నిత్యం మీతో నుందును
నేనే మార్గం... నేనే సత్యం... నేనే జీవం