Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: ప్రేమ యేసుని ప్రేమ
అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనినినమ్ము
అది భువి అందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది
నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది
నాయేసుని నిత్య ప్రేమ
1. తల్లిదండ్రుల ప్రేమ
నీడవలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ
కలలా కరిగిపోవును ||ఎ||
2. భార్యభర్తల మధ్య
వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయిరాలును త్వరలో
మోడులా మిగిలి పోవును ||ఎ||
3. బంధుమిత్రుల యందు
వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమే
వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎ||
4. ధరణిలోని ప్రేమలన్నియు
స్థిరముకావు తరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమ
కడవరకు ఆదరించును ||ఎ||