Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రేమ సందేశం - యేసుని శుభవచనం
శాంతి సందేశం-క్రీస్తుని నవ వచనం ||2||
సత్యమైనది జీవమైనది మార్గము
చూపే ప్రభువచనం ||2||
హల్లెలూయా హల్లేలూయా ||4|| ||ప్రేమ||
1. సువార్త విలువలకు-సాక్ష్యం-శుభవచనం
ప్రమోద భరితులను చేసే-శుభవచనం ||2||
అద్భుతము ఆశ్చర్యము యేసుని శుభవచనం
ఇలలోన ఆనందము ఆ ప్రభు శుభవచనం
హల్లెలూయా - హల్లెలూయా ||4|| ||ప్రేమ||
2 నూతన జగమునకు నాంది శుభవచనం
దేవుని జనమునకు దీవెన శుభవచనం ||2||
పరిశుద్ధం పరిపూర్ణం క్రీస్తుని శుభవచనం
పరలోక సౌభ్యాగం ఆ ప్రభు శుభవచనం
హల్లెలూయా-హల్లెలూయా ||4|| ||ప్రేమ||