Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా
ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియ జన సంఘమా
ప్రభుని దివ్యరూపం నీ మదిలో ప్రేమ దీపమై
వెలగాలి కలకాలం మా జీవితమే ధన్యమై
రండి రారండి ఈ జీవపు విందుకు -
రండి రారండి పరలోకపు విందుకు
1.మధురమైన ఈ విందు మనోహరుని దివ్య విందు
ముక్తి నొసగు ఈ విందు మరియ సుతుని మోక్షపు విందు ||రండి||
2. అమరమైన ఈ విందు అలుపెరుగని ఆత్మ విందు
సకల జనుల రక్షణ విందు శాంతి నొసగు శుభ విందు ||రండి||