Type Here to Get Search Results !

ప్రేమామృత ధారలు ( premamruths dharalu Song Lyrics | Telugu Christian Songs Lyrics)

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రేమామృత ధారలు చిందిన మన

యేసుకు సమమెవరు ఆ...........

ప్రేమయె తానై నిలచి ప్రేమోక్తులనే పలికి

ప్రేమతో ప్రాణము బెట్టి ప్రేమ నగరికి చనియె llప్రేమll 


1 వ చరణం.. 

నిశ్చమైన ప్రేమమూర్తికి ఇలలో తావేది ||2||

ప్రేమ ద్రోహులేగాని ప్రియమున చేరరు వాని

చేరిన చెలికాడగురా సమయమిదే పరుగిడరా llప్రేమll 


2 వ చరణం.. 

ఎంత ఘోరపాపాత్మనినైన ప్రేమించును రారా

పాప భారముతో రారా ప్రభు పాదముపై బడరా

పాపుల రక్షకుడేసు తప్పక నిను రక్షించున్‌ llప్రేమll 


3 వ చరణం.. 

ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదరేలా

రక్షణ దినమిదియేరా తక్షణమే కనుగొనరా

ఇదయే దేవుని వరము ముదమారగ చేకొనుము llప్రేమll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section