Type Here to Get Search Results !

ప్రేమతో నన్ను పలుకరించగా ( prematho nannu palukarinchaga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రేమతో నన్ను పలుకరించగా 

దివ్య భోజ్యమై వచ్చిన ప్రభువా

నీ లాగ నన్ను దీవించుటకు 

జీవాహారమై వచ్చిన ప్రభువా 

క్రీస్తుని ఆత్మమా పవిత్ర పరచుమా 

క్రీస్తుని శరీరమా నను రక్షించుమా 

క్రీస్తుని రక్తమా సంతృప్తి నీయుమా

క్రీస్తుని స్వభావమా నన్ను మార్చుమా 


1. చీకటిలో ఉన్న నాకు నీ విందు నిచ్చావు 

కష్టములో ఉన్ననాకు నీ పొందు ఒసగావు 

నీ వెలుగు విందుకు నీ ప్రేమ విందుకు 

నీ వెలుగు విందుకు ప్రేమ విందుకు 

అతిథిగ పిలిచిన ప్రభువా స్తోత్రం ||క్రీస్తుని ఆత్మమా|| 


2. ఒంటరినై ఉన్న నాకు నీ విందు నిచ్చావు 

పడిపోతూ ఉన్న నాకు నీ పొందు నొసగావు 

నీ స్నేహ విందుకు నీ కరుణ విందుకు 

నీ స్నేహ విందుకు కరుణ విందుకు 

ఆహ్వానించిన ప్రభువా స్తోత్రం 

||క్రీస్తుని ఆత్మమా|| ||ప్రేమతో నన్ను|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section