Type Here to Get Search Results !

ప్రేమతో పిలిచెను - ప్రభు ఏసు ( prematho pilichenu - prabhu yesu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ప్రేమతో పిలిచెను 

ప్రభు ఏసు విందునకు 

బహు ఆశతో కరమును చాపి

నిను నన్ను పిలిచేనుగా 

ఇలలో రక్షణ మార్గముగా 

మనకై ఒసగిన ఈ విందు

ఆరగించుదాం - ఆనందించుదాం ||2|| ||ప్రే|| 


1. వినుము నేను ద్వారము కడనే

వేచియుండి పిలచుచుంటిని

నాస్వరము విని తలుపు తెరచిన 

అందున అడుగిడి కలసి భుజించుదాం 

ప్రేమగా ఆ... ఆ... ఆ... 

ఆర్తిగా ఆ... ఆ... ఆ... 

ప్రేమగా - ఆర్తిగా 

పిలచుచుండె ప్రభు విందునకు 

ప్రభు పిలచుచుండే తన విందునకు

ఆప్రభు విందు ఇదియే 

ఆప్రభు పొందు ఇదియే ||2|| 

ఆరగించుదాం-ఆనందించుదాం ||2|| ||ప్రే|| 


2. శాశ్వత జీవపు విందు ఇదే 

సర్వశక్తిగల విందు ఇదే 

ప్రాణమునకు నెమ్మదినిచ్చే 

నిత్యజీవ ఆహారమిదే 

ఆశగా ఆ- ఆ-ఆ - లాలనగా

ఆ-ఆ- ఆ -ఆశగా - లాలనగా 

నిన్ను పిలిచేను ఆ ప్రభువు 

నీ చెంత నిలిచేను ఆ ప్రభువు 

ఆ ప్రభు విందు ఇదియే 

ఆ ప్రభు పొందు ఇదియే ||2|| 

ఆరగించుదాం - ఆనందించుదాం ||2|| ||ప్రే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section