Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రేమతో రారండి - క్రీస్తుని విందుకు
లోకాన రారండి - పావన విందుకు
కలువరి పీఠంపై - అర్పించిన విందు
మానవ రక్షణకై చేసిన - ప్రభు విందుllప్రేమll
1 వ చరణం..
దేవుని రాజ్యంలో - సత్యం ఈ విందు
రక్షణ కార్యంలో - జీవం ఈ విందు ||2||
ఏసుని హృదయంలో - మార్గం ఈ విందు
దీన జనావళికి - మోక్షం ఈ విందుllప్రేమll
2 వ చరణం..
పాపుల బ్రతుకుల్లో - కృపయే ఈ విందు
మానవ రక్షణలో - సాక్ష్యం ఈ విందు ||2||
బాధలభారంలో ఊరట ఈ విందు
యేసుని నమ్మికలో స్వస్ధత ఈ విందుllప్రేమll
3 వ చరణం..
జీవనయానంలో - గమ్యం ఈ విందు ||2||
నమ్మిన హృదయంలో - క్షేమం ఈ విందు ||2||
సేవ కార్యంలో - కాంతియే ఈ విందు
శ్రీ సభ మనుగడలో - ప్రార్ధన ఈ విందుllప్రేమll