Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పూర్ణ మనసుతో ఆరాధింతు...
పరిపూర్ణ మనసుతో ఆరాధింతు... ||2||
దేవాదిదేవుని ఆరాధింతు
పరిశుద్ధ క్రీస్తుని ఆరాధింతు
ప్రణుతించెద ప్రభు నీ నామమే
దినమెల్ల నిను నేను స్మరియించగా ||2||
||పూర్ణమనస్సుతో||
1. పరలోక నాధా దివినేలు తండ్రీ
నడిపించె నా యేసయ్యా
పరిశుద్ద దేవా ఓ పరమ తండ్రీ
నడిపించు నా యేసయ్యా ||2||
మహిమాన్వితుడా మహోన్నతుడా ||2||
నీ ప్రేమ చాలునయా ||ప్రణుతించెద||
2. గగనము నీవే సర్వము నీవే
మా హృదిలో నీవేగా
చీకటి యందే వెలుగును చూపే
ఓ పాప పరిహారకా ||2||
మనుజావతారా మహోన్నతుడా ||2||
నీ ప్రేమ చాలునయా ||ప్రణుతించెద||