Type Here to Get Search Results !

రాజా రక్షకా ( raja rakshaka Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


రాజా రక్షకా ! పూజిత క్రీస్తా ||2||

స్తుతి మహిమంబుల గౌరవ పాత్ర

అని వందించిరి వినయముతోడ

సంతోషము తోడుత బాలురు కూడి

హోసాన్నా అని గానము పాడి


1 వ చరణం.. 

ఇశ్రాయేలుల రాజువు నీవే ` 

రాజవైభవము సాంతము నీవే ||2||

అల దావీదు సంతతి యీవే

ప్రభు నామగత పాలకుడినే llరాజాll 


2 వ చరణం.. 

అతి లోకంబున అమరులందరు - 

ఈ లోకంబున మర్త్యులందరు

విశ్వ సృష్టి స్తుతి విపంచితోడ

ఆహారము మిమ్మే స్తుతించరండి llరాజాll 


3 వ చరణం.. 

మ్రాని కొమ్మలతో మధుర స్వరాలతో - 

హెబ్రూ ప్రజలు మీకెదురుగా

ప్రార్థన ప్రతిజ్ఞ శుభాశీస్సులతో

ఆహ్వానింతుము జయగీతాలతో llరాజాll 


4 వ చరణం.. 

సిలువ పాటులను చెందక ముందు - 

వినిచె హెబ్రీయులు పాటపసందు

పాలితులేము అమరుల విందు

గీతా మధురిమ చేతుము విందు llరాజాll 


5వ చరణం.. 

సద్గుణ దీపా, సాదర భూపా`

సకల శుభంబు మంజుల రూపా ||2||

భక్త పూజిత, భక్త తోషిత

మా భక్తి ప్రపత్తుల మోదము గనుత llరాజాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section