Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రాజువైన నా దేవా - నిన్నే ఘనపరతును
నీ నామమును నిత్యము - సన్నుతించెదము
అనుదినము నేను నిన్ను - స్తుతియింతును
నిత్యమునీ నామమును - కీర్తింతును
యెహోవా - మహిమ గలవాడా -
అధిక స్తోత్రము - నొంద దగినవాడా ||2|| llరాజువైనll
1 వ చరణం..
దయాదాక్షిణ్యము కలవాడా - దీర్ఘాశాంతుడా
కరుణ శీలుడా నా ప్రభువా - నీవే నా రక్షకుడా ||2||
ప్రేమపూర్ణుడా - స్తుతులకు పాత్రుడా ||2|| llయెహోవాll
2 వ చరణం..
గుండె చెదరిన వారిని - బాగు చేసిన దేవా
క్రుంగి పోయిన వారిని - లేవదీసిన ప్రభువా ||2||
సర్వ జీవులకన్నులు - నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు ఆహారమిచ్చెదవు llయెహోవాll