Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: రండి యెహెూవాను గూర్చి ఉత్సాహ గానము చేసెదము
ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని -
ఆహా... అల్లెలూయా... ||2||
1. కష్ట నష్టము లెన్నున్నా పొంగు సాగరమెదురైనా
ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో ||2||
2. విరిగి నలిగిన హృదయముతో దేవ దేవుని సన్నిధిలో
అనుక్షణం ప్రార్థించినా కలుగు మేలులు మనకెన్నో ||2||
3. త్రోవ తప్పిన వారలను - చేరదీసే నాధుడని ll 2 ll
నీతిసూర్యుడు ఆయనే-నిత్యము స్తుతి చేసెదము ll రండిll