Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: రాజాధిరాజా రావయ్యా నీవు నా ఇంట
వేంచేయగ నా బ్రతుకు చిగురించగ...
1. నీ ప్రేమ మహిమలో పరవసించి
పాడగ నాదు మధుర మాటలే
మనసు నిండి పోవగ స్వర్గ సీమ భాగ్యము
నీదు శాంతి జీవము నేడే మమ్ము జేరగలరు llరాజాధిll
2. నీదు పూజ్య దేహము మాకు అమర భోజ్యము
నీదు పూజ్య రుధిరము పరమ జీవధారగ
జేరమమ్ము ఈ దినం చేయు మయ్య వందనంllరాజాధిll
3. పాప తిమిర మంతయు - అంతరించి పోవగ ||2||
నీదు కరుణ కాంతులు - హృదయమంత సోకగా ||2||
ప్రేమ పీఠమందున - పూజలందరావయ్య
మనసు గుడిగ - చేసితి...llరాజాధిll